గాలోడుగా సాఫ్ట్ వేర్ సుధీర్…..
తెలుగు బుల్లితెర సంచలనం ‘జబర్దస్త్’ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఆ మధ్య ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ మూవీలో హీరోగా కూడా నటించాడు. ఆ సినిమాకు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో విడుదలైన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా… సుధీర్ కు మాత్రం ఆ సినిమాకు మంచి మార్క్ లే వచ్చాయి.
అయితే తాజాగా మరోసారి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలోనే ‘గాలోడు’ సినిమా చేయబోతున్నాడు సుడిగాలి సుధీర్. ఈరోజు పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాకు సంబంధించిన హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. బుల్లితెరపై కామెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ వెండితెరపై మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా పేరు తెచ్చుకోవాలని తెగ ఆరాటపడుతున్నాడు. దీంతో ‘సాప్ట్ వేర్ సుధీర్’ చేసిన సుధీర్ ఇప్పుడు ‘గాలోడు’గా అలరించే ప్రయత్నం చేయబోతున్నాడు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఇదేదో సీరియస్ సినిమా అనే తెలుస్తోంది. కాగా సంస్కృతి ఫిలిమ్స్ బ్యానర్ లో నిర్మాణం జరుపుకోబోతున్న ఈ మూవీతో సుధీర్ హీరోగా ఎదగాలని కోరుకుందాం.