గాంధీ ఆసుపత్రికి కేసీఆర్.. రోగులకు భరోసా..
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. గాంధీ ఆసుపత్రిలో సౌకర్యాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాంధీ ఆసుపత్రుల్లోని కొన్ని వార్డులను సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించారు.
అదేవిధంగా సరాసరిగా కరోనా రోగుల వద్దకు వెళ్లిన ఆయన వారికి ధైర్యం చెప్పారు. కరోనా నుంచి తప్పక కోలుకుంటారని వారికి భరోసాను ఇచ్చారు. కాగా సీఎం వెంట మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్ లు ఉన్నారు. ఇదే సమయంలో కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రాణాలకు తెగించి వైద్యం అందిస్తున్న వైద్యులను, వైద్య సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించడం విశేషం.