క్వారీలో పేలుడు పై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి…
ఆంధ్రప్రదేశ్ లోని వైయస్ఆర్ కడప జిల్లా మామిళ్ళపల్లె శివారులో ముగ్గు రాయి క్వారీలో జరిగిన పేలుడు ఘటనలో పలువురు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పేలుడు ఘటన జరగటానికి గల కారణాలను ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా క్వారీలో ముగ్గురాయి వెలికితీత పనులకు వెళ్లిన కూలీలు… వెలికితీత సమయంలో ఒక్కసారిగా పేలుడు పదార్థాలు పేలాయి. దీంతో అక్కడికక్కడే 10 మంది క్వారీ కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.