కొత్త చట్టం షాక్ : ఆ దేశంలో మహిళ ఎంతమందినైనా పెళ్లాడొచ్చు….

ఓ దేశం తాను చేసిన కొత్త చట్టంతో ప్రజలకు షాక్ ఇవ్వబోతుంది. అదేమంటే.. ప్రపంచంలో ఉదారవాద రాజ్యాంగం, చట్టాలు ఉన్న దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటి అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ దేశంలో ఇప్పటికే బహుభార్యత్వం అమలులో ఉంది. ఇక్కడ ఒక వ్యక్తి ఎంతమంది మహిళలనైనా పెళ్లాడవచ్చు. దీంతో దేశంలో చాలామంది పురుషులు ఒకరి కంటే ఎక్కవ మంది భార్యలను వివాహం చేసుకున్నారు. అయితే.. ఇప్పుడు ఈ దేశంలో మరో చట్టాన్ని కూడా అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఒక మహిళ ఎంతమంది పురుషులనైనా పెళ్లాడే విధంగా చట్టాన్ని తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.
అయితే అందుకు గ్రీన్ పేపర్ పేరుతో చట్టాన్ని తీసుకురాబోతుంది ఆ ప్రభుత్వం. కానీ.. కొన్ని సంస్థలు మాత్రం ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదేగాని అమలులోకి వస్తే.. ఒక మహిళ ఎంతమంది పురుషులనైనా పెళ్లి చేసుకొనే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఆమెకు పుట్టే బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోవడం కష్టం అవుతుందని, డిఎన్ఏ టెస్టులు చేయాల్సి వస్తుందని కొన్ని సంస్థలు చెప్తున్నాయి. కాగా దేశంలో బహుభార్యత్వం ఉన్నప్పుడు, బహుభర్తృత్వం ఎందుకు ఉండకూడదనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరి ఏం జరుగుతుంది.. ఈ విషయంలో ప్రభుత్వం ఏవిధంగా ముందుకు పోతుంది అనేది వేచి చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *