కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డ కిషన్ రెడ్డి…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కిషన్ రెడ్డి ఒక్కసారిగా మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు శవాల మీద పేలాలు ఎరుకునే రాజకీయాలు చేయడం సరికాదని.. కరోనాతో ప్రజలు చనిపోతుంటే రాజకీయాలు చేయడం ఏంటి? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అదేవిధంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… కేసీఆర్ కుటుంబ సభ్యులు, మంత్రులు అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, బాధ్యత రహితంగా కామెంట్స్ చేయడం మంచిది కాదని స్పష్టం చేసారు. ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూపడం సరికాదని, కేంద్రం అన్ని రకాలుగా అదుకుంటుందని.. కేంద్ర ప్రభుత్వానికి అందరి ప్రాణాలు సమానమేనని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా కరోనా కేసులు, అక్కడ పరిస్థితిని బట్టి ఆక్సీజన్, రేమిడిసివిర్ లను కేటాయిస్తుందని.. వివక్ష చూపెడుతుంది అనడం చాలా దురదృష్టకరమని కిషన్ రెడ్డి విమర్శించారు. ముఖ్యంగా కేంద్రం గాంధీ హాస్పిటల్ కి గాలి నుండి ఆక్సీజన్ తయారు చేసే యూనిట్స్ ఇచ్చిందని.. రెండు రోజుల్లో అవి అందుబాటులోకి వస్తాయని అన్నారు. దీంతో నిమిషానికి వేయి లీటర్ ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని.. వరంగల్, కరీంనగర్ లకు కూడా ఆక్సిజన్ తయారీ యూనిట్స్ పంపిస్తుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *