కేసీఆర్ పై మండిపడ్డ రాములమ్మ…

తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేత విజయశాంతి విరుచుకు పడ్డారు. తెలంగాణ భూముల అమ్మకంపై ఆర్థికమంత్రి హరీష్ రావు వాదన చాలా అసంబద్ధంగా ఉందని… గత సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భూముల అమ్మకాలు, దోపిడీకి వ్యతిరేకంగానే మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని, అది గుర్తుపెట్టుకోవాలని ఆమె మండిపడ్డారు. ధనిక రాష్ట్రం అని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ మరిప్పుడు ఈ తెలంగాణలో భూముల అమ్మకాలు, వేలాలు ఏంటి? అంటూ ఆమె నిలదీశారు.
అదేవిధంగా అప్పుల పాలు చేసిన మన తెలంగాణ రాష్ట్రాన్ని… అని సీఎం కెసిఆర్ ఒప్పుకుని ఇందుకు క్షమాపణ చెప్పి తీరాలని ఆమె తెలిపారు. అలాగే ఈ విషయంపైనే ప్రజలు మరో ఉద్యమానికి తప్పక సమాయత్తం కావాలని అన్నారు. ఠికానా లేక భూములమ్మే వరకు రాష్ట్రాన్ని తెచ్చిన మీకు, ఈ కోట్ల విలువైన కార్ల పంపిణీ ఎందుకు? అంటూ ఆమె ప్రశ్నాస్త్రాన్ని సంధించారు. అంతేకాకుండా ఉన్న జైళ్ళు కూల్చుడెందుకు? కోట్ల రూపాయల వృధా చేసి పబ్లిసిటీ ఖర్చులెందుకు? అసలు సెక్రెటేరియట్కే రాని సీఎం కెసిఆర్ కు కొత్త భవనాలెందుకు? అంటీ విజయశాంతి తీవ్రంగా మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *