కేసీఆర్ కు వైఎస్ షర్మిల చురకలు…

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై వైఎస్ షర్మిల మరోసారి కౌంటర్ వేశారు. తెలంగాణ సర్కార్ అన్ని విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికనే పోస్టులు భర్తీ చేస్తుందని తెలిపారు. సిఎం పదవిని కూడా కాంట్రాక్టు పద్దతిన చేపట్టాలని కెసిఆర్ కు చురకలు అంటించారు. అసలు ఆమె ఏమన్నారంటే… ‘అన్నింటా కాంట్రాక్ట్ పోస్టులే అయితే.. ఇక సిఎం పదవి కూడా కాంట్రాక్టు కింద పెట్టుకుంటే పోలే’ అని ముచ్చట చెప్పిన కెసిఆర్ సారుకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలే ముద్దుగా కనిపిస్తున్నాయి, కరోనా విజృంభిస్తున్న వేళా .. కాంట్రాక్టుపై వైద్య సిబ్బందిని నియమించాలని నిర్ణయించుకొన్నది ప్రభుత్వం. 2017లో 3311 స్టాఫ్ నర్సులకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం, అర్హత సాధించిన ఇంకా 658 మందికి మాత్రం ఉద్యోగాలు కల్పించలేదు. ఇప్పుడు కాంట్రాక్టు పద్దతిపై నర్సింగ్ సిబ్బందిని తీసుకోవాలనుకొనే ప్రభుత్వం, ముందు అర్హత సాధించిన 658 మందిని పర్మినెంట్ గా రిక్రూట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని షర్మిల పేర్కొన్నారు. మరిప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *