కేంద్ర కేబినెట్ లోకి శివసేన…. ఉద్ధవ్ క్లారిటీ…!

దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో కేంద్రప్రభుత్వం కేబినెట్ విస్తరణపైనే చర్చ జరుగుతుంది. అయితే కేంద్ర కేబినెట్ విస్తరణపై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నప్పటికీ.. చివరకు ముహూర్తం పెట్టేశారు. దీంతో ఈరోజు సాయంత్రం కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో 20 మందికి పైగా కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్లు సంకేతాలు అందుకుతున్నాయి.
ముఖ్యంగా దేశంలోని నాల్గవ అతిపెద్ద పార్టీ అయిన వైసీపీని కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించేందుకు బీజేపీ తీవ్రప్రయత్నం చేసింది. కానీ చివరకు మోడీ రంగంలోకి దిగినా ప్రత్యేక హోదా అన్న ఒక్క అంశంతో వైఎస్ జగన్ అందుకు ససేమిరా అన్నారు. ఇదే సమయంలో.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత దూరమైన బీజేపీ-శివసేన మళ్లీ ఒక్కటి కానున్నాయనే ప్రచారం కూడా పెద్దఎత్తున సాగుతుంది. అందులో భాగంగా శివసేన కేంద్ర కేబినెట్లోనూ చేరుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే. కేంద్ర మంత్రివర్గంలో చేరే అంశంపై వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. అదేవిధంగా బీజేపీతో శివసేన తిరిగి సఖ్యతపై వస్తున్న వార్తలను ఖండించారు. తాను ఎక్కడికే వెళ్లడం లేదని స్పష్టం చేశారు. అలాగే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం ఉద్ధవ్ థాకరే.. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన తర్వాత నుంచి.. మళ్లీ శివసేన-బీజేపీ దోస్తీ చేస్తాయనే ప్రచారం విపరీతంగా జరిగింది. అందుకు చెక్ పెట్టేందుకు సీఎం క్లారిటీ ఇవ్వడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *