కేంద్రం గుడ్ న్యూస్.. అందరికీ వ్యాక్సిన్ ఫ్రీ….
దేశంలో కరోనా కోరలు పురులు విప్పి చాలా తీవ్రంగా విస్తరిస్తుంది. దీంతో రాష్ట్రాలకు కేంద్రం తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ళు నిండిన వారికి వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం అంగీకారాన్ని తెలిపింది. అయితే… వ్యాక్సిన్ ఉత్పత్తి దారులు 50శాతం టీకాలను కేంద్రానికి, 50 శాతం టీకాలను రాష్ట్రాలకు, ప్రైవేట్ ఆసుపత్రులకు అందించనున్నట్టు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే రాష్ట్రాలకు ఒక్కో డోసును రూ.400 లకు అందించాలని నిర్ణయం తీసుకున్నాయి. దీనిపై సర్వత్రా వ్యతిరేకత ఎదురైంది కూడా. కాగా కేంద్రానికి ఒక ధర, రాష్ట్రాలకు ఒక ధర అని నేతలు సోషల్ మీడియాలో విమర్శలు సైతం గుప్పించారు. ఈ విమర్శలన్నింటికీ చెక్ పెడుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు ఉచితంగా టీకాలను అందించాలని నిర్ణయం తీసుకుంది. కరోనా ఉత్పత్తి దారుల నుంచి రూ.150 కి కొనుగోలు చేసి వాటిని రాష్ట్రాలకు ఉచితంగా అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం విశేషం.