కృష్ణా, గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలత విజయం
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో కల్పలత ఘన విజయం సాధించడం విశేషం. అయితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బొడ్డు నాగేశ్వరరావుపై ఆమె విజయం సాధించారు.
అదేవిధంగా విజయానికి కావాల్సిన 50 శాతం ఓట్లు (6153) దాడడంతో కల్పలత గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. అయితే తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 6153 రాకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించవలసి వచ్చింది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 6153 సాధించడంతో కల్పలత విజయం సాధించారు.
కాగా ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సమీప ప్రత్యర్థి నారాయణ రావుపై ఆయన 1537 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. షేక్ సాబ్జీకి 7983 ఓట్లు రాగా.. నారాయణకు 6446 ఓట్లు పోల్ అయినట్లు అధికారులు వివరించారు.