కామెడీ వీడియోను చేర్ చేసిన స్మృతి ఇరాని….
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓ నవ్వు తెప్పించే వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇండియన్ యూట్యూబర్ ఆశిష్ చంచలానీకి సంబంధించిన ఈ వీడియోలో ఇంట్లో ఫోన్ ఛార్జర్‌ను మరచి పోయినప్పుడు ఎలా ఉంటుంది? ట్రాఫిక్ పోలీసు ఆపినందుకు ఒక వ్యక్తి ఎలా స్పందిస్తాడు? అనే విషయాలను ఫన్నీగా చూపించారు. అయితే ఈ వీడియోలో ఆశిష్ స్కూటర్ ను నడుపుకుంటూ వెళ్తాడు. రోడ్డుపై అతడికి ట్రాఫిక్ పోలీస్ కన్పించగానే అతను స్కూటర్ ను టర్న్ చేస్తాడు. మొత్తానికి తిప్పలు పడి ట్రాఫిక్ పోలీస్ ఆశిష్ స్కూటర్ ను ఆపుతాడు. అతన్ని లైసెన్స్ చూపించమని అడుగుతాడు. అతను దానిని వెంటనే చూపిస్తాడు. అప్పుడు ఆశిష్‌ను ఆర్సి, పిఒసి, ఇన్సూరెన్స్ అడుగుతాడు ట్రాఫిక్ పోలీస్. అతను అడిగిన అన్నీ చూపిస్తాడు ఆశిష్. మరి ఆ తర్వాత మరికొన్ని అడుగుతాడు.
అవేమంటే.. హాల్ టికెట్, పాన్ కార్డ్, సిబిఎస్ఇ క్వచ్చన్ పేపర్, 10వ తరగతి మార్క్స్ షీట్, కరెంట్ బిల్ వంటి వాటిని అడుగుతాడు. ఆశ్చర్యకరంగా ఆశిష్ వద్ద అవన్నీ ఉంటాయి. దీంతో విసుగెత్తిపోయిన ట్రాఫిక్ పోలీస్ ఎందుకు పరిగెత్తావు? అని ఆశిష్ ను అడుగుతాడు. ఆశిష్ ఏడుపు మొదలుపెట్టి.. ‘ఛార్జర్ భూల్ గయా థా సాబ్ ఘర్ పె, ఫోన్ మెయిన్ ఛార్జింగ్ నహీ హై ఇస్లీయే జా రాహా థా’ అంటాడు. సర్, నేను ఇంట్లో ఛార్జర్‌ను మరచిపోయాను. నా ఫోన్ పూర్తిగా ఛార్జింగ్ అయిపోయింది. అందుకే నేను బండిని వెనక్కి తిప్పాలని ప్రయత్నించాను. వెంటనే మీరు పట్టేసుకున్నారు అంటాడు. నవ్వు తెప్పించే ఈ ఫన్నీ వీడియోను కామెడీగా ఉందని షేర్ చేశారు స్మృతి ఇరానీ. అయితే ఈ వీడియోను షేర్ చేసిన తక్షణమే వైరల్ అయ్యింది. అలాగే కొన్ని గంటల్లోనే లక్షకు పైగా ఈ వీడియోను వీక్షించి కామెంట్స్ రాస్తుండటం విశేషం.