కల్తీ మద్యం కేసులో 9మందికి మరిణ శిక్ష
బీహీర్ కోర్ట్ సంచలన తీర్పు వెల్లడించింది. ఏకంగా 21 మంది ప్రాణాలు తీసిన కల్తీ మద్యం కేసులో సుమారు ఐదేళ్ల తర్వాత సంచలన రేపేలా తీర్పు చెప్పింది. అసలు విషయం ఏమిటంటే.. రాష్ట్రంలోని గోపాల్‌గంజ్‌లో 2016లో కల్తీ మద్యం తాగి 21 మంది మృతిచెందారు. ఈ కేసులో.. ఈరోజు బీహార్‌లోని స్పెషల్ ఎక్సైజ్ కోర్టు తొమ్మిది మందికి మరణశిక్ష విధించి సంచలనానికి తెరదీసింది.
అదేవిధంగా మరో నలుగురు మహిళా నిందితులకు యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. యావజ్జీవ శిక్ష పడిన మహిళలకు 10లక్షల జరిమానా కూడా విధించింది ఎక్సైజ్ కోర్టు. అలాగే ఈ కేసులో ఫిబ్రవరి 26వ తేదీన 13 మందిని దోషులుగా తేల్చిన స్పెషల్ ఎక్సైజ్ కోర్టు.. ఈరోజు శిక్షలు ఖరారు చేసింది. వీరిలో 9 మంది ఒకే కుటుంబానికి చెందినవారు కావడం మరింత సంచలనంగా మారింది. కాగా 2016 ఆగస్టులో గోపాల్‌గంజ్ లోని ఖర్జుర్‌బానీ ప్రాంతంలో నాటు సారా తాగి 21మంది మృతిచెందారు. పలువురు కంటి చూపును కూడా కోల్పోయారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ముగ్గురు ఎస్ఐలతో పాటు 21 మంది పోలీసులను డిస్మిస్ కూడా చేశారు అధికారులు.