కలెక్టర్ రోహిణి సింధూరిపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు….
కర్ణాటక ప్రభుత్వానికి కలెక్టర్ రోహిణి సింధూరి కొరకరాని కొయ్యగా మారారు. ఎంతో నిజాయితీ కలిగిన ఐఎఎస్ ఆఫీసర్ గా పేరొందిన రోహిణి సింధూరి వరస విమర్శలతో పాపులర్ అవుతున్నారు. మైసూరులోని దట్టగళ్లిలోని తమ కన్వెన్షన్ హాల్ అక్రమంగా నిర్మించారని గత కలెక్టర్ రోహిణి సింధూరి చేసిన ఆరోపణలపై తాజాగా కేఆర్ నగర జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యే సా.రా మహేశ్ ఆందోళనకు దిగారు. ప్రాంతీయ కమిషనర్ ఆఫీసు ఆవరణలో ఒంటరిగా కాసేపు కూర్చొని నరసన తెలిపారు. అయితే తన ఆస్తి ఏదైనా గానీ అక్రమమని తేలితే వాటిని గవర్నర్ పేరిట రాసిస్తానని ఆయన సవాల్ విసిరారు. అదేగాని.. సక్రమం అని తేలితే ఆమె ఉద్యోగానికి రాజీనామా చేస్తారా? అంటూ తీవ్రమైన ఛాలెంజ్ చేశారు.
అదేవిధంగా జిల్లా చుట్టుపక్కల జరిగిన భూకుంభకోణాలపై దర్యాప్తునకు ఐఏఎస్ రోహిణి సింధూరిని నియమించాలని ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ డిమాండ్ చేయడంతో మరోవైపు రాజకీయం రాజుకుంది. ఈ భూకుంభకోణంపై ఆమెకు పూర్తి అవగాహన ఉందని ఆయన వెల్లడించారు. దీంతో ఇద్దరు ఐఏఎస్ల మధ్య రగడ తారా స్థాయికి చేరడంతో తాజాగా సీఎం యడియురప్ప రోహిణి సింధూరిని, కమిషనర్ శిల్పానాగ్లను వేర్వేరు శాఖలకు బదిలీ చేయడంతో మరో ట్విస్ట్ ఏర్పడింది.