కర్నాటక సీఎం రేసులో ఆ ముగ్గురు….

కర్ణాటకలో సీఎం మార్పు తథ్యంగా కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే ఈ విషయం తేటతెల్లం అవుతుంది. ఇదే విషయాన్ని యడ్డియూరప్ప స్వయంగా ప్రకటించారు. బీజేపీలో 75 ఏళ్లు నిండిన వారిని పదవుల నుంచి తప్పించే సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయాన్ని ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు గౌరవిస్తూ వస్తున్నారు. తన విషయంలో కూడా ఇదే విధమైన సంప్రదాయం ఉంటుందని, అందులో ఎలాంటి మార్పు ఉండదని యడ్డియూరప్ప విధానసభలో పేర్కొనడం విశేషం. అదేవిధంగా ఈనెల 26వ తేదీకి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అవుతుంది. దీంతో రెండేళ్ల సంబరాల తర్వాత తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని యడ్డియూరప్ప వెల్లడించారు.

అంతేకాకుండా ఎవర్ని కొత్త ముఖ్యమంత్రిగా నియమిస్తారనేది పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ప్రహ్లాద్ జోషి, సీటీ రవి, మంత్రి మురుగేష్ నిర్వాణీ, ముఖ్యమంత్రి అశ్వత్థ నారాయణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రహ్లాద్ జోషికి లేదా సీటీ రవికి ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని ఆర్ఎస్ఎస్ పట్టుబడుతున్నట్లు సమాచారం అందుతుంది. కాగా కర్ణాటకలో లింగాయత్ల హవా అధికంగా ఉండటంతో ఆ వర్గానికి చెందిన మురుగేష్ నిర్వాణీకి ముఖ్టమంత్రి పదవి ఇవ్వాలని కొందరు చెప్తున్నారు. మరి ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రిగా పనిచేస్తుండగా, సీటీ రవి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *