కర్నాటక సీఎం రాజీనామా…!

కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లపాటు విజయవంతంగా ప్రభుత్వాన్ని నడిపినట్టు యడ్యూరప్ప ప్రకటించారు.

అదేవిధంగా పార్టీ తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని.. పార్టీ నియమావళికి కట్టుబడి రాజీనామా చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. కాగా మరికాసేపట్లోనే ముఖ్యమంత్రి యడియూరప్ప తన రాజీనామాను గవర్షర్ కు అందజేయనున్నారు. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రిని మారుస్తారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అప్పట్లో యడ్యూరప్ప ఈ వార్తలను ఖండించారు. అదిష్టానం తనకు హామీ ఇచ్చిందని వెల్లడించారు. కాగా 75 ఏళ్లు దాటిన వ్యక్తులు అత్యంత కీలకమైన పదవుల్లో ఉండటం పార్టీ నియమావళికి విరుద్ధం కావడంతో దానికి కట్టుబడి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చినట్లు తెలిపారు. అయితే యడియూరప్ప తర్వాత ఎవరు కర్నాటక ముఖ్యమంత్రి అవుతారు? అన్న అంశంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *