కరోనా లాక్ డౌన్ విషయంలో మోడీ క్లారిటీ.. కరోనా కర్ఫ్యూ విధించాల్సిందే…

దేశంలో కరోనా చాలా తీవ్రంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోన్న ఈ సమయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సమయంలో కరోనా వ్యాప్తి, లాక్డౌన్, కర్ఫ్యూ, వ్యాక్సినేషన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో దశలో కరోనా వేగంగా విస్తరిస్తోందని తెలిపిన ఆయన పెరుగుతున్న కేసులను చూసి భయపడొద్దని ధైర్యం చెప్పారు.
అదేవిధంగా లాక్డౌన్ విధించాల్సిన అవసరం లేదని, ప్రస్తుత పరిస్థితి ఓ సవాలుగా మారుతోందని అన్నారు. కోవిడ్ సెకెండ్ వేవ్తో మనందరం పోరాడాల్సిన అవసరం ఉందని.. మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, పంజాబ్ వంటి పలు రాష్ట్రాల్లో మనుపటి గరిష్ఠ స్థాయిని మించి పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని వివరించారు. అయితే ఈ దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా అలసత్వం పెరిగిందని తెలిపిన ఆయన కరోనాపై పోరాటం కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పెద్ద ఎత్తున కరోనా టెస్టులు చేయాలని, ఈ క్రమంలో కేసుల సంఖ్య పెరిగినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎంలకు మోడీ సూచించారు. వ్యాక్సిన్ వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా కీలక సూచన చేశారు.
అంతేకాకుండా కరోనా కట్టడికి రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించిన ప్రధాని.. కోవిడ్ టెస్ట్లు పెంచాలని.. ముఖ్యంగా ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య భారీగా పెంచాలని వివరించారు. వ్యాక్సినేషన్ కంటే టెస్టులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. సెకండ్ వేవ్ పై ఎవరూ నిర్లక్ష్యం వహించకూడదని.. అందరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరారు. కాగా ఏప్రిల్ 11నుంచి 14వతేదీ వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని పిలుపునచ్చారు. కాగా 45 ఏళ్లు దాటినవారు వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు. కోవిడ్ పెరిగినా భయం వద్దని.. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉండదని స్పష్టం చేశారు మోడీ. చివరగా ఆయా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ పెడితే మంచిదని తెలిపారు. కరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూ ఓ ప్రత్యామ్నాయం అని.. నైట్ కర్ఫ్యూను ‘కరోనా కర్ఫ్యూ’గా పిలుద్దామని మోడీ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *