కరోనా బారిన బిగ్ బాస్ బ్యూటీ
హిందీలోని బిగ్ బాస్ షో ఫైనలిస్ట్ గా నిలిచిన నిక్కీ తంబోలి కోవిడ్ బారిన పడింది. ప్రస్తుతం ఆమె హోమ్ క్వారంటైన్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అంతే కాదు నిక్కి తంబోలి ఆరోగ్యం నిలకడగానే ఉండటంతో ఇంటి నుంచే డాక్టర్లతో టచ్ లో ఉంటూ తగిన వైద్యం తీసుకుంటుంది. ఈ విషయం తన తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో వెల్లడించింది. ప్రస్తుతం నిక్కీ తంబోలి కొన్ని మ్యూజిక్ వీడియోస్ షూటింగ్ లో పాల్గొంటోంది.
అయితే కరోనాతో ఆమె ఇంటికే పరిమితమైంది. తాజాగా ఆమె ‘నేటి ఉదయమే కోవిడ్ పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది. అందుకే.. నేనే సెల్ప్ క్వారంటైన్ లో ఉండాలని అనుకుంటున్నాను. వైద్యుల సూచనతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వాడుతున్నాను. గత కొద్ది రోజుల్లో నాతో సన్నిహితంగా ఉన్న వారందర్నీ కోవిడ్ పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ ప్రేమ, సహకారాలకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. తప్పక మాస్క్ ధరించండి. చేతులు ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోండి. సామాజిక దూరం పాటించండి. లవ్ అండ్ లైట్’ అంటూ నిక్కి తంబోలి పోస్ట్ చేశారు.