కరోనా పేషెంట్స్ కోసం ఆశ్రమం ప్రారంభించిన లింగుస్వామి….

తమిళనాడులో కరోనా చాలా తీవ్రంగా వ్యాపిస్తుంది. దీంతో ప్రముఖులు ఎవరికి తోచిన విధంగా వారు సహాయం చేస్తూ వైరస బారిన పడిన వారిని ఆదుకుంటున్నారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో వైరస్ తీవ్రత విపరీతంగా ఉంది. దీంతో కరోనా బారిన పడిన వారికి ఆసుపత్రులలో పడకలు లేకపోవడం, ఆక్సిజన్ కొరత వంటి సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి.
అదేవిధంగా కరోనావైరస్ సంబంధిత సహాయ నిధికోసం రాజకీయ పార్టీ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు అన్ని వర్గాల ప్రజలు తమిళనాడు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. అలాగే వైరస్తో పోరాడుతున్న వారి చికిత్సకు ఇది ఎంతో ఉపయోగపడుతుందనే చెప్పాలి. తాజాగా ప్రముఖ దర్శకుడు లింగుస్వామి కరోనా రోగుల కోసం ఒక ఆశ్రమాన్ని ప్రారంభించారు. మనప్పక్కంలో ప్రారంభించిన ఆశ్రమాన్ని ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. మంత్రి టిఎం అన్బరసన్, నటుడు కీర్తి సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా సౌత్ లో పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈ దర్శకుడు లింగుస్వామి పరిశ్రమలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఎనర్జిటిక్ హీరో రామ్తో కలిసి తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు డైరెక్టర్ లింగుస్వామి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *