కరోనా టైంలో వెరైటీ పెళ్లి….
కరోనాకు దేశమంతా విలవిలలాడిపోతుంది. దీంతో రోజుకీ కరోనా కేసులు 3.50 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఇప్పుడిప్పుడే కర్ప్యూలు, లాక్ డౌన్ లతో కొన్నిచోట్ల కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు.
అయితే కరోనా కాలంలో మనుషులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. పెళ్లిళ్లకు హాజరు కావాలంటే ఈ కాలంలో చాలా కష్టంగా మారింది. ఈ తురణంలో పెళ్లిళ్లు కూడా చాలా వెరైటీగా జరుగుతున్నాయి. కొన్ని కొన్ని చోట్ల ఈ కరోనా సమయంలో జరిగే వింతలు భలే తమాషాగా అనిపిస్తున్నాయి. సహజంగా మాస్క్ ధరించి కొందరు వివాహాలు చేసుకుంటే, మరికొందరు పీపీఈ కిట్లు ధరించి పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా చత్తీస్గడ్కు చెందిన ఓ జంట కొంచెం క్రియేటివ్గా ఆలోచించి వివాహం చేసుకున్నారు. మాస్క్ ధరించిన ఈ జంట పూల మాలలు మార్చుకునే విధానంలో క్రయేటివిటీకి పదును పెట్టారు. అదెలాగంటే… పూలదండలకు వెదురు కర్రలు కట్టి వాటి ద్వారా మాలలు మార్చుకోవడం అక్కడ అందరినీ విశేషంగా అలరించింది. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అంతా కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.