కరోనా కట్టడి కోసం రాహుల్ రంగంలోకి… సలహాలు మాత్రమే…
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే కరోనాను కట్టడి చేసేందుకు దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు. కొన్నిచోట్ల పాక్షిక, మరికొన్ని రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్డౌన్ ఆంక్షలు అమలు జరుగుతున్న విషయం తెలిసిందే.
అయితే కరోనా కట్టడి కోసం కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధి రంగంలోకి దిగారు. కీలక సూచనలు చేశారు. జన్యుక్రమ విశ్లేషణల ద్వారా వైరస్ దాని మ్యూటెంట్లను శాస్త్రీయంగా నిర్ధారించాలని తెలిపారు. అలాగే కొత్త వైరస్ వేరియంట్లపై వ్యాక్సిన్ సామర్ధ్యాన్ని పెంచాలని, దేశంలో వీలైనంత త్వరగా అందరికీ వ్యాక్సిన్ అందించాలని కోరారు. ముఖ్యంగా భారత్లో చేసే పరిశోధనలపై పారదర్శకతను పాటిస్తూ యావత్ ప్రపంచానికి అన్ని విషయాలు తెలియజేయాలని రాహుల్ గాంధీ సూచించడం విశేషం.