కరోనా ఎఫెక్ట్ : కోహ్లీతో అనుష్క… ఓ కొత్త ఆలోచన…
బాలీవుడ్ నటి, ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్యామణి అనుష్క శర్మ మే 1వ తేదీన తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోలేదు. అందుకు కారణం లేకపోలేదు. అయితే అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ ఆమె పుట్టిన రోజు వేడుకలను చేసుకోపోవడానికి గల కారణాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
అదేమంటే… కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తాను జన్మదిన వేడుకలు చేసుకోవడం సరైనది కాదనిపించిందని వెల్లడించింది. అలాగే తనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ అనుష్కశర్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితులు బాగా లేవని.. అత్యవసర పరిస్థితి అయితేనే బయటకు వెళ్ళండని.. మాస్కులు ధరిస్తూ మీరంతా సురక్షితంగా ఉండాలని ప్రజలకు కోరింది. కాగా తన భర్త విరాట్ కోహ్లీతో కలిసి ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు కూడా వివరించింది. ఇలాంటి కష్ట సమయంలో దేశంలోని పేదలను ఆదుకోవడమే ఆ కార్యక్రమ ఉద్దేశమంటూ వెల్లడించింది.. చూద్దాం విరుష్క జోడీ ఏం చేస్తుంది అనేది.