కరోనాతో వర్మ సినిమా వాయిదా

దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు రోజు రోజుకీ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ కరోనా మహమ్మారి కారణంగా నిన్న ఒక్కరోజే 154 మంది మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో 10,57, 241 మందికి కొవిడ్ నిర్ధరాణ పరీక్షలు నిర్వహించగా సుమారు 39,670 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.
అయితే తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా తీవ్రంగా విజృంభిస్తుంది. తెలంగాణలోని పాఠశాలలలో కరోనా ప్రభావం బాగా ఉంది. తాజా సంఘటనలతో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన తర్వాతి సినిమాను కోవిడ్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ‘దేశంలోని అనేక ప్రాంతాల్లో అకస్మాత్తుగా తీవ్రమైన కోవిడ్ పెరుగుదల, కొత్త లాక్ డౌన్ వార్తల మధ్య, మేము.. మా స్పార్క్ యూనిట్ ‘డి-కంపెనీ’ సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాము. త్వరలోనే కొత్త తేదీ ప్రకటించబడుతుంది’ అంటూ వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *