కరోనాతో అమాంతం పడిపోయిన ప్రధాని మోడీ రేటింగ్….

కరోనా సెకండ్ వేవ్ తో భారత్ విలవిలలాడిపోతుంది. ఈ మధ్య కాస్త కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుతున్నప్పటికీ… రికవరీ రేటు పెరుగుతున్నా.. మృతుల సంఖ్య మాత్రం ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉంది. అదే సమయంలో భారత్లో మరికొన్ని కోవిడ్ కొత్త వేరియంట్లు.. చాలా దేశాలకు పాకడం వంటి అంశాలు, సెకండ్ వేవ్ ప్రభావం.. భారత ప్రధాని నరేంద్ర మోడీ రేటింగ్పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. కోవిడ్ పెరుగుతూ ఉంటే.. ప్రధాని మోడీ రేటింగ్ మాత్రం క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు భారత్ విలవిల్లాడుతున్న ఈ తరుణంలో గ్లోబల్ లీడర్గా ప్రధాని మోడీ రేటింగ్ అత్యంత కనిష్టానికి పడిపోయినట్టు అమెరికాకు చెందిన ఓ సర్వే సంస్థ తన నివేదికలో వెల్లడించింది.
అయితే ప్రంపచస్థాయి నేతలకు చెందిన పాపులారిటీని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉండే అమెరికాకు చెందిన డాటా ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ సరికొత్తగా మేడీ రేటింగ్ ని తెలిపింది. అలాగే దానికి సంబంధించిన నివేదికలను కూడా విడుదల చేసింది. ఆ సంస్థ తాజాగా పేర్కొన్న నివేదిక ప్రకారం.. ఈ వారంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఓవరాల్ రేటింగ్ 63 శాతానికి పడిపోయినట్టుగా స్పష్టం చేసింది. 2019 ఆగస్టు తర్వాత తమ సంస్థ ప్రధాని మోడీ పాపులారిటీని ట్రాక్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇదే అత్యంత కనిష్ట రేటింగ్గా తెలిపింది. ఇంకా భారత్ నుంచి బలమైన నేతగా ఎదిగారు ప్రధాని మోడీ.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ప్రధాని పీఠం ఎక్కారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మరిన్ని ఓట్లు, సీట్లను సాధించుకున్నారు. గత మూడు దశాబ్దాల్లో ఏ ఇండియన్ నేతకు సాధ్యం కానీ మెజారిటీని ప్రధాని మోడీ సుసాధ్యం చేసి చూపించారు. దాంతో బలమైన జాతీయ నేతగా ఇమేజ్ సొంతం చేసుకున్నారు మోడీ.
కానీ ఇప్పుడు పూర్తిగా పరిస్థితి మారిపోయింది. కరోనా ఫస్ట్ వేవ్ ప్రభావం పెద్దగా లేకపోయినా.. సెకండ్ వేవ్ తీవ్రంగా జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. ఆక్సిజన్ లేక, వైద్యం అందక.. బెడ్లు కూడా దొరకక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం మృతదేహాలకు దహనసంస్కారాలు కూడా నిర్వహించకుండా.. గంగా నదిలో పారవేయడం కూడా పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అద్దం పడుతుంది. అసలు భారత్ కరోనాను జయించినట్లుగా కటింగ్ ఇచ్చి అరికట్టడంలో దారుణంగా విఫలమైంది. ఇదే సమయంలో.. ప్రధాని మోడీ రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయినే నడిచింది. ఇలా.. అన్నీ కలగలిసి ప్రధాని మోడీ ప్రతిష్టను దెబ్బకొట్టాయి. రేటింగ్ పడిపోవడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *