కరోనాతా యాక్టర్, డైరెక్టర్ లలిత్ బెహల్ మృతి

దేశంలో కరోనా తీవ్రస్థాయిలో తన ప్రభావాన్ని చూపుతుంది. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో సామాన్యుడి నుంచి ప్రముఖుడి వరకు అంతా కరోనా కాటుకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజాగా బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత అయితే లలిత్ బెహల్ కరోనాతో మృతి చెందాడు. కోవిడ్ -19 సంబంధిత అనారోగ్యం కారణంగా కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఆయన వయసు 71 సంవత్సరాలు. గతవారం ఈ సీనియర్ నటుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే ఈ విషయంపై లలిత్ బెహల్ కుమారుడు, దర్శకుడు కను బెహల్ మాట్లాడుతూ… ‘శుక్రవారం మధ్యాహ్నం ఆయన చనిపోయారు. గతంలో గుండెకు సంబంధించిన అనారోగ్యం, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకడంతో ఆరోగ్యం పూర్తిగా విషమించింది’ అని తెలిపారు. పలు చిత్రాలకు దర్శకుడిగా, నిర్మాతగా పని చేసిన ఆయన కుమారుడు కను బెహల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టిట్లీ’, ‘ముక్తి భవన్’ వంటి సినిమాల్లో నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు. కాగా ఆయన మరణవార్త విన్న ప్రముఖులు ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సినీపరిశ్రమలో ఎంతో మంది ప్రముఖులను కరోనా కాటుకు బలికావడం కలవరానికి గురి చేస్తున్న అంశంగా చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *