కత్రినా అప్పట్లో ముంబైకి బాయ్ చెప్పేద్దాం అనుకుందట…..!

బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ షాకింగ్ కామెంట్స్ చేసేసింది. నిజంగా ఫ్యాన్స్ కంగారుపడేదే. అదేమంటే.. ‘గుడ్ బై ముంబై.. నమస్తే లండన్’.. అంటూ తిరిగి తన సొంత నగరానికి వెళ్దామని భావిస్తుందట బ్రిటీష్ సుందరి. కంగారు పడకండి.. ఇప్పుడు కాదటలే.. ఒకప్పుడు…
అయితే జూలై 16వతేదీన బర్త్ డే జరుపుకోవటంతో 38 ఏళ్లు పూర్తి చేసుకున్న సీనియర్ సుందరి కత్రీనా కైఫ్. 2003లో ‘బూమ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కత్రినా.. ‘బూత్’ కాస్తా ఢామ్మనటంతో మొదట్లో డీలా పడింది. అలా 2003 నుంచి 2007వరకు ఆమెకి ఫ్లాప్సు, విమర్శలు తప్ప సక్సెస్ లేదు. ప్లాస్టిక్ బొమ్మ అనేవారు ‘మల్లీశ్వరి’ని అప్పట్లో! కానీ, ‘నమస్తే లండన్’ మొత్తం అంతా మార్చేసింది! కత్రీనాకి తొలిసారి పొగడ్తలతో పాటూ కెరీర్ లో ఓ చెప్పుకోదగ్గ హిట్ వచ్చింది. కానీ, ‘నమస్తే లండన్’ రిలీజ్ కి ముందు ఈ భామ ముంబై వదిలి లండన్ వెళ్లిపోదామని భావించిందట. అంతేకాకుండా బాలీవుడ్ వద్దు.. అసలు నటనే వద్దు… మరేదైనా ‘వర్కవుట్’ అయ్యే కెరీర్ మొదలెడదాం అని ఆలోచించిందట. బాలీవుడ్ అదృష్టంతో కత్రినా అలాగే నిలవడం విశేషం.

‘కాఫీ విత్ కరణ్’ షోలో కత్రీనా స్వయంగా ఈ విషయం చెప్పేసింది. ‘నమస్తే లండన్’ సినిమా చూసి తన అభిప్రాయం చెప్పమన్నాడట దర్శకుడు విపుల్ షా. కానీ.. తీరా మూవీ చూసిన మేడమ్ గారికి నచ్చలేదట. కారణం ఏంటంటే… సినిమా నిండా తానే కనిపించిందట! కథ మొత్తం తన చుట్టూనే తిరగటంతో ఇక ‘నమస్తే లండన్’ పని అయిపోయినట్టే అని భయపడిపోయిందట. అప్పటికే ఆమెపై విమర్శలు, స్క్రీన్ మీద పెద్దగా బాగోదని దుష్ప్రచారం జరుగుతుండటంతో… “నేను బాగోనని’’ కత్రీనా కూడా ఆలోచనలో పడిందట. కాగా ‘నమస్తే లండన్’ సినిమా చూసి అభిప్రాయం చెప్పమన్న డైరెక్టర్ విపుల్ షాకి కత్రీనా ఫోన్ కూడా చేయలేదు. తన గదిలో బట్టలు ప్యాక్ చేసుకుని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేదాకా వెళ్లిపోయింది కత్రినా. చూస్తుండగానే ‘నమస్తే లండన్’ విడుదల కావటం, హిట్ కావటం చకచకా జరిగిపోయాయి! ఆ తర్వాత ‘వెల్కమ్, అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ, జిందగీ నా మిలేగీ దుబారా, ఏక్ థా టైగర్, ధూమ్ 3, బ్యాంగ్ బ్యాంగ్’.. ఇవన్నీ జరిగిపోయాయి! నెక్ట్స్ ‘సూర్యవంశీ’ సినిమాలో మరోసారి తన ‘నమస్తే లండన్’ హీరో అక్షయ్ తోనే నటించింది కత్రీనా. ఆ సినిమా త్వరలోనే విడుదల కానుండటం విశేషం. మొత్తానికి అప్పటి తన ఆలోచన స్థిరంగా ఉండబట్టే కత్రినా అలా భలే ఎదిగిపోయింది..నిజమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *