ఐటీ రైడ్స్ లో దొరికిపోయిన తాప్సీ, అనురాగ్ కశ్యప్
బాలీవుడ్ పై ఐటీ పంజా విసిరింది. పేరుమోసిన ప్రొడక్షన్ సంస్థపై ఒక్కసారిగా పలు చోట్ల ఐటీ రైడ్స్ చేపట్టడంతో అడ్డంగా దొలిరిపోయారు. తాజాగా తారలపై జరిపిన ఐటీ దాడులతో లెక్కచెప్పని ధనం తేలిపోయింది. ముఖ్యంగా ఫాంటమ్ ఫిలిం ప్రొడక్సన్ కంపెనీ కేసులో భాగంగా జరిపిన ఐటీ దాడుల్లో భారీ మొత్తంగా లెక్కలు తారుమారు అయినట్లుగా గుర్తించారు.
అదేవిధంగా ఐటీశాఖ వారు ఈ తనిఖీలను అనురాగ్ కశ్యప్, తాప్సీ తదితరుల ఆస్తులపై నిర్వహించారు. దీంతో ఫాంటమ్ ఫిలిం ప్రొడక్షన్లో చేసిన సినిమాల లెక్కలన్నింటినీ సరిచూడగా దాదాపు రూ.650 కోట్లకు సంబంధించిన లెక్కలు తారుమారయ్యాయని అధికారులు వెల్లడించారు. ఫాంటమ్ ఫిలిం కంపెనీ స్టాఫ్ రూ.300 కోట్ల లెక్కలు చెప్పలేక పోయిందని, అలాగే మరో రూ.350 కోట్ల టాక్స్లను చెల్లించలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా నటీమణి తాప్సీ ఇంట్లో ఏకంగా రూ.5 కోట్లు లెక్కలేని ధనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇంకా వారి వారి ఆఫీసుల్లో విచారణ, తనిఖీలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.
అయితే ఫాంటమ్ ఫిలిం కంపెనీపై ఉన్న టాక్స్ కేసు నిమిత్తం ముంబై, పూణెలలో దాదాపు 28 చోట్ల ఐటీ రైడ్స్ జరిగాయి. ప్రభుత్వ విచారణ ప్రకారం రిలియన్స్, క్వాన్ సంస్థలపైన కూడా ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. వారి వద్ద నుంచి ఏడు బ్యాంక్ లాకర్స్ను స్వాదీనం చేసుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఇంకా మరిన్ని విషయాలు తెలియాలంటే కొంత సమయం వేచి చూడాల్సి ఉంది.