ఏ క్షణంలోనైనా విశాఖ నుంచి పాలన స్టార్ట్….

ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల వ్యవహారం ఎప్పుడూ హాట్ హాట్ గా సాగుతుంటుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి.. మూడు రాజధానుల వ్యవహారం పడుతూ.. లేస్తూ… పలు కోర్టు కేసులతో వాయిదాలు పడుతూ వస్తుంది. చాలా కాలంగా విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది.. త్వరలోనే విశాఖ నుంచే పాలన.. వంటి స్టేట్మెంట్లు అధికార పక్షం నుంచి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ ఎపిసోడ్పై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ… ఏ క్షణంలోనైనా విశాఖ నుంచి పాలన ప్రారంభం కాబోతుందని స్పష్టం చేశారు.
అదేవిధంగా తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజధానుల వికేంద్రీకరణపై అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన రోజు నుంచే ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. అలాగే సాంకేతిక అంశాలను అడ్డు పెట్టుకుని మూడు రాజధానులను టీడీపీ అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు బొత్స. అయితే మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. ఏక్షణం నుంచైనా విశాఖ నుంచి పాలన ప్రారంభమౌతుందని ఆయన ప్రకటించారు. అలాగే సమావేశాలను ఎక్కడి నుంచైనా నిర్వహించుకోవచ్చని కోవిడ్ మహమ్మారి తర్వాత నిరూపితమైందని ఆయన వెల్లడించారు. కాగా విశాఖలో రాజధానికి సరిపడా మౌలిక సదుపాయాలు ఉన్నాయని…. అవసరం అయితే పెంచుకుంటామని కూడా ఆయన వివరిచారు. అందుకోసం సంవత్సరాలు, యుగాలు అవసరం లేదని కూడా మంత్రి బొత్స సత్యనారాయణ వివరించడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *