ఏపీ విద్యా శాఖ మంత్రి కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
అదేవిధంగా తొలి నుంచీ ఒక ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవడంతో విద్యాసంవత్సరాన్ని గాడిలో పెట్టినట్లు ఆయన వెల్లడించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, అలాగే కేసులు పెద్ద సంఖ్యలో నమోదౌతున్న విద్యాసంస్థలను వెంటనే మూసివేయాలని కూడా ఆయన అన్నారు. పెద్ద ఎత్తున సంక్షోభం తలెత్తినపుడు కొంత నష్టం తప్పక ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. కరోనా సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పాఠశాలలు, కళాశాలల్లో కరోనా నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు. కాగా విద్యార్థులకు కరోనా టెస్టులు పెంచుతామని కూడా అయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.