ఏపీలో 3 రాజధానులు ఆమోదం పొందినట్లే.. !
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన నాటి నుంచీ ప్రజామోద పాలనకోసం నిరంతరం పోరాడుతున్నాడు. వ్యవస్థలతో ఓ రకంగా యుద్ధం చేస్తున్నడు. అన్నింటినీ గాడిలో పడేసేంత వరకు అదే వ్యవస్థలతో కొట్లాడుతున్నాడు. న్యాయపరంగా ఎన్ని రకాలు ఎదురు దెబ్బలు అక్రమంగా తిన్నా అదే న్యాయాన్ని సక్రమంగా తమవైపుకు తిప్పుకొనేంతవరకు న్యాయాన్ని కూడా నిద్రపోనీయడం లేదు కదా… న్యాయ నిపునులనే ఔరా అనిపించేలా చేస్తున్నాడు. దట్ ఈజ్ జగన్.
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ ఏకపక్షంగా వచ్చిన విషయం తెలిసిందే. 73 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లలో వైసీపీ విజయం సాధించింది. ఇలాంటి రిజల్ట్స్ వస్తాయని ఎవరూ కూడా ఊహించలేదు. గుంటూరు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీ గెలిస్తే అమరావతి రాజధాని తరలిపోతుందని, టీడీపీకి ఓటు వేయాలని టీడీపీ ప్రచారం చేసింది. కానీ.. ప్రజలు అందుకు విరుద్ధంగా వైసీపీకి ఓటు వేసి గెలిపించారు. గుంటూరు, విజయవాడ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకోవడంతో రాజధాని వికేంద్రీకరణ ప్రక్రియకు మార్గం సులభం అయ్యింది. అయితే సీఎం వైఎస్ జగన్ ప్రతీ వేషయంలో ప్రజలు కోరుకున్నట్లు పాలించడమే తన నైజం. అదే విధంగా ప్రజామోదం పొందిన మూడు రాజధానుల విషయంలో కూడా ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ వికేంద్రీకరణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ప్రజలకు పనులు చేస్తున్న ప్రభుత్వం అని నమ్మకం కుదరడంతో అందరూ వైసీపీకి మద్దతు పలికారని వైసీపీ చెప్తుంది. మూడు రాజధానుల ఏర్పాటు అంశం ఇక లాంఛనమే అని వీలైనంత తొందరగా ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తి చేస్తుందని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం విశేషం.