ఎస్బీఐ గుడ్ న్యూస్… ఇక నేరుగా ఇంటికే డబ్బులు…
స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా శుభవార్త చెప్పింది. ఇది తమ వినియోగదారులకు వరం అనే చెప్పాలి. ఇప్పుడున్న కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వినియోగ దారులకు సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. అదేమంటే… మీరు ఇంట్లో ఉండి ఫోన్ చేస్తే చాలు మీ డబ్బును ఇంటికే బ్యాంక్ అధికారులు వచ్చి డబ్బులిచ్చే సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం విశేషం. ఇందుకోసం కస్టమర్లు టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయడం గానీ, ముబైల్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ సదుపాయం ద్వారా కానీ పొందవచ్చు.
సేవలు ఎలా అంటే…
ఈ ఇంటివద్దకు సేవలు ద్వారా కేవలం క్యాష్ విత్ డ్రా మాత్రమే కాకుండా ఇంటి వద్ద నుంచే మరిన్ని సేవలు ఉపయోగించుకోవచ్చు. చెక్, డ్రాఫ్ట్, పే ఆర్డర్ వంటివి మాత్రమే కాకుడా కేవైసీ పత్రాలు సేకరించడం, లైఫ్ సర్టిఫికేట్, ఫారం 15హెచ్ ను సమర్పించడం వంటి సదుపాయాలను కస్టమర్లు ఇంటివద్ద నుంచే పొందవచ్చు.
ఎవరికి ఉపయోగం….
ఈ ఇంటివద్దకు బ్యాంకింగ్ సేవలకు సంబంధించి ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ ద్వారా మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సౌకర్యాన్ని 70 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులు ఉపయోగించుకోవచ్చు. అలాగే కేవైసీ కంప్లైంట్ కస్టమర్లు కూడా పొందవచ్చు. అయితే జాయింట్ ఎకౌంట్ కల వారికి, మైనర్ ఖాతాలు, నాన్- పర్సనల్ ఖాతాలకు ఈ సౌరక్యం లేదు. ఇంకా కస్టమర్ తమ హోం బ్రాంచ్ నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఉండాలి. కస్టమర్లు అడ్రస్, బ్యాంక్ కు ఇచ్చిన అడ్రస్ కు కలవాలి అప్పుడే ఇలాంటి సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది ఎస్బీఐ.
ఇందుకోసం…
ఇంటి వద్దకు సేవలు పొందాలంటే.. ఆ బ్యాంకింగ్ కస్టమర్ కేర్ అధికారి కస్టమర్ నుంచి రూ.88.55వసూలు చేస్తారు. ఆ తర్వాత బ్యాంక్ ఉద్యోగులు మీ ఇంటికి అవసరమైన అన్ని విషయాలను పూర్తి చేస్తారు. అయితే ఈ సేవలు అన్ని వయస్కుల వారికి అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఈ సేవలను ఎలా వినియోగించుకోవాలంటే…
ఎస్బీఐ టోల్ ఫ్రీ నంబర్ – 18001037188 లేదా 18001213721 కు కాల్ చేయడం ద్వారా మీరు ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. అలాగే bank.sbi/dsb వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ సేవలను పరిశీలించవచ్చు. అంతేకాకుండా ఫోన్ లో డిఎస్బి ముబైల యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా కూడా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు.