ఎయిర్ పోర్ట్ లో 28కోట్ల మొత్తంలో డ్రగ్ సీజ్…
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో భారీస్థాయిలో డ్రగ్స్ దొరికిపోయింది. కోట్ల రూపాయాల డ్రగ్ ఎయిర్ పోర్ట్ లో పట్టుకున్నారు. ఓ లేడీ కిలాడీ నుండి సుమారు రూ. 28 కోట్ల విలువ చేసే హెరాయిన్ మత్తు పదార్దాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. జోనస్ బర్గ్ వయా దోహా నుండి ఢిల్లీ వచ్చిన మాలావి దేశస్థురాలు తన లగేజ్ బ్యాగ్ ఓ డబ్బాలో తెల్లటి పౌడర్ ను దాచి తరలించే ప్రయత్నం చేసింది.
అయితే ఆ లగేజ్ బ్యాగ్ స్కానింగ్ చేసిన ఢిల్లీ కస్టమ్స్ అధికారులు బృందం… డబ్బాలో 28 కోట్ల విలువ చేసే నాలుగు కేజీల హెరాయిన్ డ్రగ్స్ ను గుర్తించారు కస్టమ్స్ అధికారులు. కాగా వెంటనే 4 కేజీల డ్రగ్స్ ను సీజ్ చేసిన అధికారులు… ఆ లేడి కిలాడీపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన కస్టమ్స అధికారులు విచారణ చేపడుతున్నారు.