ఎన్నికలు ముగిశాయ్… మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో ఇప్పటికే పెట్రోల్ ధరల్ విపరీతంగా పెరిగాయి. ఈ మధ్య కాలంలో వరుసగా పెరుగుతూ వచ్చిన పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపించాయి. కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటడం వాహనదారులకు షాక్ కి గురిచేస్తుంది.
అయితే గత రెండు నెలలుగా పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. అందుకు కారణం లేకపోలేదు. ఎందుకంటే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసినప్పటి నుంచి ఆ ఊసే లేకుండా చేసింది కేంద్రం. కొన్ని కొన్ని సార్లు తగ్గాయి తప్పితే.. పెరిగింది మాత్రం లేదు. అయితే ఇప్పుడు మాత్రం తిరిగి వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 15 పైసలు, లీటర్ డీజిల్ పై 16 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.56 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ.80.73 కు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.93.99 చేరుకోగా.. డీజిల్ ధర రూ. 88.05 కు చేరి సామాన్యుడికి షాక్ ఇస్తుంది.