ఎన్టీఆర్ కు అత్త పురంధేశ్వరి బర్తే డే విషెస్….
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ కు ఆయన అత్త పురంధేశ్వరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె ట్వీట్ చేశారు. అందులో ఆమె ఏమన్నారంటే… ‘మీరు చాలా స్పషల్…. అందుకే మీ మనోహరమైన ముఖం ఎప్పుడూ చిరునవ్వులతో ఉండాలి… హ్యాపీ బర్త్ డే రాక్స్టార్’ అంటూ పేర్కొన్నారు. అలాగే నిన్నటి నుంచే ఎన్టీఆర్ పుట్టినరోజు సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేశారు ఆయన అభిమానులు. నిన్నటి నుంచే ట్విట్టర్లో హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఈ కరోనా సంక్షోభంలో బహిరంగంగా తన పుట్టినరోజు వేడుకలు జరపొద్దు అంటూ అభిమానులను కోరిన విషయం తెలిసిందే. మొత్తానికి ఈరోజు ఎన్టీఆర్ అభిమానులతో సోషల్ మీడియా రచ్చ రచ్చే.