ఎంపీ విజయసాయి రెడ్డిని అదుపులో పెట్టండి : ఆర్ఆర్ఆర్
ఆంధ్రప్రదేశ్ నర్సాపురం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత రఘురామకృష్ణంరాజు.. ప్రతిరోజూ ఏదో ఓ విషయంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కి లేఖలు రాస్తున్నారు. అందులో ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు.. పథకాలపై సంచలన అంశాలు వెల్లడిస్తున్నారు. అయితే వివాదాస్పద వ్యాఖ్యలతో కేసుల పాలైన ఆయన.. అరెస్ట్, జైలు, ఆస్పత్రి, హైకోర్టు, సుప్రీంకోర్టు, లోక్సభ స్పీకర్ అలా అలా తిరిగి తిరిగి చివరకు అన్ని రాష్ట్రాల గవర్నర్లు, సీఎంల వరకు వెళ్లింది ఆయన వ్యవహారం.
అయితే ఈ మధ్య వరుసగా సీఎం జగన్కు లేఖలు రాస్తున్నారు ఎంపీ రఘురామరాజు. తాజాగా మరో లేఖను రాశారు. అందులో ఏమని ప్రస్తావించారు అంటే… ఎంపీ విజయస్థాయి రెడ్డిని అదుపులో పెట్టాలంటూ ఈసారి విచిత్రంగా చర్చించారు. అలాగే అశోక్ గజపతిరాజుపై ఎంపీ విజయసాయిరెడ్డి అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని ఆయనను వెంటనే అదుపు చేయాలని లేఖలో సీఎం వైఎస్ జగన్ను కోరారు రఘురామకృష్ణరాజు. అదేవిధంగా ఎంపీ విజయసాయిరెడ్డి తీరుతో పార్టీకి భారీ నష్టం జరిగే అవకాశం ఉందని లేఖలో ప్రస్తావించిన ఆయన అశోక్గజపతి రాజుపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని సూచించారు. అంతేకాకుండా మాన్సాస్ ట్రస్టుపై హైకోర్టు ఈ మధ్య ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఉత్తర్వులు వెలువడినప్పటి నుంచి అశోక్గజపతిరాజుపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడుతున్నారు. కాగా పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయకుండా వెంటనే అదుపులో పెట్టాలని లేఖలో సీఎంకు రఘురామ కృష్ణరాజు విజ్ఞప్తి చేయడం విశేషం.