ఈటల తర్వాత బీజేపీలోకి కొండా…?

తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ పలు రకాల తర్జన భర్జనల తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. అందుకోసం ఈరోజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కాసేపటి క్రితం విలేఖరుల సమావేశంలో మాట్లాడిన ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే వచ్చేవారం బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇదే ఊపులో బీజేపీలోకి మరింత మంది చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి.. ఏ పార్టీలో చేరలేదు.. ఏ పార్టీలో చేరాలన్నదానిపై కొన్ని రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటానని తన రాజీనామా సందర్భంగా వెల్లడించిన విషయం కూడా తెలిసిందే. అదేవిధంగా ఆయన బీజేపీ గూటికి చేరడం ఖాయమనే ప్రచారం అప్పటినుంచి జోరుగా ఊపందుకుంది. అయితే తాజాగా బీజేపీ నేత డీకే అరుణతో సమావేశమయ్యారు కొండా విశ్వేశ్వరరెడ్డి. పార్టీలో చేరిక పై చర్చించినట్టు తెలుస్తోంది. కాగా ఈ విషయంలో ఆలస్యం చేయ వద్దని వెంటనే నిర్ణయం తీసుకోవాలని డీకే అరుణ సూచించినట్లుగా కూడా తెలుస్తోంది. మరి అందుకు విశ్వేశ్వర్రెడ్డి కూడా సానుకూలంగానే స్పందించారని టాక్. కాగా అన్నీ అనుకున్నట్టు జరిగితే.. త్వరలోనే కొండా విశ్వేశ్వర్రెడ్డి.. బీజేపీలో చేరే అవకాశం ఉంటుందని సమాచారం. తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే.. అసలు ఈటల రాజేందర్.. బీజేపీలో చేరడానికి కొండా రాయబారం నడిపారని కూడా సమాచారం. మరి ఈటల తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరతారా? మరి మరికొంతమందిని బీజేపీలో చేర్చిన తర్వాత చేరతారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *