ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీనే టాప్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చేపట్టినప్పటి నుంచీ ఏపీ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతుంది. ఏపీ దేశంలోని ప్రముఖులే కాకుండా ప్రపంచస్థాయి ప్రశంసలు అందుకుంటుంది. ఇప్పటికే ఎన్నో రంగాల్లో ర్యాంక్ లను సైతం కైవసం చేసుకోవడం విశేషంగా చెప్పవచ్చు.
తాజాగా మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రెండో అతిపెద్ద తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. అలాగే… ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-2020లో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించారు. అంతేకాకుండా దేశంలోని ఎగుమతుల్లో ప్రస్తుత ఏపీ వాటా 4శాతమని.. 2030 నాటికి దేశ ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 10శాతానికి పెంచటం లక్ష్యంగా పెట్టుకున్నామని కూడా స్పష్టం చేశారు. ఇంకా రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో గ్రీన్ ఫీల్డ్ పోర్టుల అభివృద్ధి జరుగుతోందని, 2023 నాటికి వాణిజ్య కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని కూడా స్పష్టం చేశారు. వీటి ద్వారా అదనంగా 100 మిలియన్ టన్నుల కార్గో రవాణాకు అవకాశం ఏర్పడుతుందని జగన్ వివరించారు. చివరగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పరిశ్రమలకు ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని కూడా సీఎం వైఎస్ జగన్ సమావేశంలో మాట్లాడుతూ స్పష్టం చేశారు.