ఇక ట్రాపిక్ కు చెక్…. హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ రెడీ…!

హైదరాబాద్ ప్రజలకు మరో శుభవార్త అనే చెప్పాలి. అదేమంటే.. 2017 లో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన.. బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. సుమారు రూ. 385 కోట్లతో మూడున్నరేళ్ల కాల వ్యవథిలో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ బ్రిడ్జికి ఇరువైపులా రెండు డివిజన్లు ఉండగా… ఒకటి ఫతేనగర్, మరొకటి బాలానగర్. అలాగే ఈ రెండు డివిజన్లలో వందలాది పరిశ్రమలు కూడా ఉన్నాయి. దీంతో నిరంతరం కార్మికులు, లారీలు, ఆటో ట్రాలీలతో విపరీతమైన రద్దీ కొనసాగే పరిస్థితి. ఇప్పుడు ఆ ట్రాపిక్ కు చెక్ పడనుంది.
అదేవిధంగా ఈ బ్రిడ్జి పొడవు 1.13 కిలోమీటర్లు, 24 మీటర్లు వెడల్పుతో మొత్తం 26 పిల్లర్లతో నిర్మించారు. ఈ బ్రిడ్జికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమంటే.. హైదరాబాద్ నగరంలోని అతి ప్రధాన రహదారుల్లో ఇది ఒకటి. కాగా 6 లేన్లతో సిటీలోనే నిర్మించిన మొట్టమొదటి బ్రిడ్జి ఇదే కావడం విశేషం. కాగా 2050 సంవత్సరం వరకు ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. కాగా దీనికి బాబూ జగజ్జీవన్రామ్ బ్రిడ్జిగా నామకరణం చేయనున్నారు. ఇది ఇలా ఉంటే.. రూ. 385 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని రేపు మంత్రి కేటీఆర్ ప్రారంభిం చనున్నారు. దీంతో బాలానగర్ ఏరియాలో ట్రాఫిక్ సమస్యలు తొలగిపోనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *