ఇక అశ్విన్ ఆడాల్సిందే: బ్రాడ్ హగ్ రికమెండ్
భారత్ క్రికెటర్ అశ్విన్ ను వన్డే జట్టులోకి తీసుకోవాల్సిన టైం ఆసన్నమైందని అన్నారు ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్. బౌలింగ్ తో అద్భుత ప్రదర్శన చేసే అతడు చివర్లో బ్యాటింగ్ తో కూడా జట్టును ఆదుకోగలడని స్పష్టం చేశాడు. అయితే వన్డే మ్యాచ్ ల్లోకి అశ్విన్ ను తీసుకోవడం కోహ్లీసేనకు ఎంతో మేలు చేసే అంశంగా బ్రాడ్ తెలిపాడు.
అయితే అశ్విన్ను వన్డే జట్టులోకి తీసుకోవడం ద్వారా ఆఖర్లో బ్యాటింగ్ సామర్థ్యం పెరుగుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా టాప్ ఆర్డర్లో బ్యాట్స్మెన్ మరింత దూకుడుగా ఆడతారని వెల్లడించాడు. అశ్విన్ ఎకానమీ సైతం చాలా బాగుందని.. అతడిని జట్టులోకి తీసుకోండి అంటూ రికమెంట్ చేశాడు బ్రాడ్ హగ్. కాగా అశ్విన్ 2017 నుండి ఇప్పటివరకు తిరిగి వన్డే జట్టులో ఆడకపోవడం శోచనీయం. సెలక్టర్లు అతడిని కేవలం టెస్టులకు మాత్రమే పరిమితం చేయడంతో ఆటకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు టీ 20 సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ తో జరగబోయే వన్డే జట్టులోకి అశ్విన్ ను తీసుకుంటారా? లేదా?అనేది వేచి చూడాల్సి ఉంది.