ఇంకా కొనసాగుతున్న వైఎస్ షర్మిల నిరాహార దీక్ష

తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ప్రకటించక ముందే సంచలనంగా మారారు. ముఖ్యంగా తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని కోరుతూ వైఎస్ షర్మిల గురువారం నుంచి నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అయితే చెప్పినట్లుగానే ఏప్రిల్ 15వ తేదీన ఇందిరాపార్క్ వద్ద దీక్షకు కూర్చున్నారు వైఎస్ షర్మిల. సాయంత్రం తర్వాత పోలీసులు దీక్షను అడ్డుకున్నారు. అక్కడి నుంచి వైఎస్ షర్మిలను లోటస్ పాండ్ లోని తన ఇంటికి చేర్చడంతో అక్కడే ఆమె దీక్షకు దిగారు. ఇంట్లో నుంచే షర్మిల దీక్ష చేస్తున్నారు.
అదేవిధంగా ఏప్రిల్ 15 నుంచి మూడు రోజులపాటు దీక్ష చేస్తున్నట్టు ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మం సంకల్ప సభ సాక్షిగా చెప్పిన విషయం తెలిసిందే. చెప్పిన విధంగానే ఆమె దీక్షకు దిగడంతో రాజకీయాల్లో కలకలం మొదలైంది. చెప్పిన విధంగానే తాను మూడు రోజులపాటు దీక్ష చేసి తీరుతానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. కాగా ఈరోజు రెండో రోజు. లోటస్ పాండ్ నుంచే దీక్ష చేస్తుండటం విశేషం. లోటస్ పాండ్ లోని తన ఇంటి నుంచే చేస్తున్న వైఎస్ షర్మిల దీక్షను పోలీసులు అడ్డుకుంటారా? లేదా? అనేది వేచి చూడాలి. విశేషమేమిటంటే… నిన్న సాయంత్రం ఇందిరా పార్క్ వద్ద వైఎస్ షర్మిల దీక్ష భగ్నం చేసేందుకు పోలీసులు హైడ్రామా నడిపారు. లోటస్ పాండ్ వరకు నడుచుకుంటూ పోతానన్న షర్మిల ఆలోచనను వారు పూర్తిగా పక్కనబెట్టి పోలీస్ వాహనంలో ఎక్కించుకొని ఆమెను లోటస్ పాండ్ లో విడిచిపెట్టారు. దీంతో వైఎస్ షర్మిల లోటస్ పాండ్ నుంచే దీక్ష సాగిస్తుంటడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *