ఆ పని చేసినందుకు గాను స్వరాభాస్కర్ పై కేసు…
బాలీవుడ్ నటీమణి స్వరా భాస్కర్ పై కేసు నమోదైంది. ట్విట్టర్ లో తరచుగా వివాదాస్పద ట్వీట్స్ చేసే స్వరా భాస్కర్ మరోసారి కాంట్రవర్సీలో ఇరుక్కుంది. ఆమెతో పాటూ ట్విట్టర్ ఇండియాపై, మరికొందరిపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అసలు ఏం జరిగింది అంటే… ఓ వీడియో. ‘ఘజియాబాద్ దాడి వీడియో’గా సొషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటోన్న క్లిప్పింగ్ లో ఓ ముస్లిమ్ వ్యక్తి తనపై దాడి జరిగిందని అన్నాడు. ‘జై శ్రీరామ్’ అననందుకు తనని కొట్టారనీ, బలవంతంగా గడ్డం గొరిగించారనీ ఆరోపించాడు. అయితే.. ఆయన మాటల్ని వెనుకా ముందు ఆలోచించకుండా స్వరా భాస్కర్ తో సహా చాలా మంది షేర్ చేశారు. ఇది చిన్నచిన్నగా హిందూ, ముస్లిమ్ సమస్యగా అభివర్ణించారు.
అయితే పోలీసులు మాత్రం… దాడికి గురైన బాధితుడు, కంప్లైంట్ లో ఎక్కడా, తన చేత బలవంతంగా ‘జై శ్రీరామ్’ అనిపించినట్టు చెప్పలేదని అంటున్నారు. అలాగే.. ఎఫ్ఐఆర్ లో బాధితుడు తన అభిమతానికి వ్యతిరేకంగా గడ్డం తీయించినట్టు కూడా ఆరోపించలేదు. దాంతో ఘజియాబాద్ లో జరిగింది వ్యక్తుల మధ్య గొడవే తప్ప హిందూ, ముస్లిమ్ విభేదాలు కావని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక్కడ స్వరా భాస్కర్ ఏం చేశారు అంటే… ఆమె మరికొంత మంది షేర్ చేసిన వీడియోలోని ఆరోపణలు తప్పు అంటూ పోలీసులు చెప్పారు. దీంతో ఓ లాయర్ కేసు పెట్టాడు. ఆయన వాదన ప్రకారం స్వరా భాస్కర్, ఇతరులు, ట్విట్టర్ ఇండియా హెడ్ మనీశ్ మహేశ్వరీ… వీళ్లంతా తప్పుడు సమాచారం లక్షలాది మంది ఫాలోయర్స్ కి అందిస్తూ మతాల నడుమ కలహాలకి కారణమయ్యారని… అలాగే ఏ కొంచెం అనుమానం వచ్చినా ‘మ్యానిపులెటెడ్ మీడియా’ అంటూ ట్యాగ్ చేసే ట్విట్టర్ స్వర భాస్కర్ షేర్ చేసిన వీడియోపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. అందుకే.. ట్విట్టర్ పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు దారుడు పోలీసుల్ని కోరాడు. కాగా పోలీసులు ప్రస్తుతం స్వరాబాస్కర్ తో సహా ట్విట్టర్ ఇండియాపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారిస్తున్నారు.