ఆర్సి 15 కోసం రంగంలోకి థమన్….
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాని ‘ఆర్సి 15’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం తారాగణం, ఇతర సిబ్బందిని ఎంపిక చేసే పనిలో పడ్డారు మూవీ మేకర్స్. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను ఇప్పటికే ఈ సినిమా కోసం రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతుంది. ఈ సినిమా కోసం యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ను తీసుకోనున్నట్లు విపరీతమైన టాక్ నడుస్తోంది.
అదేవిధంగా ‘అల వైకుంఠపురములో’ వంటి అద్భుతమైన సౌండ్ ట్రాక్ ను అందించిన థమన్ ఈ సినిమాకు కూడా సంగీతం అందించబోతున్నారని సమచారం అందుతుంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. అంతేకాకుండా హీరోయిన్ గా పలువురి పేర్లు విన్పిస్తున్నాయి. అందులో ముఖ్యంగా కియారా అద్వానీ, పూజాహెగ్డే, అలియా భట్ ల పేర్లు వైరల్ గా మారాయి. మరి మేకర్స్ ఎవరిని ఎంపిక చేస్తారు అనే విషయం ఆసక్తికరంగా మారింది.