ఆర్ఆర్ఆర్ పై కేసు… రంగంలోకి సీబీఐ…
ఆంధ్రప్రదేశ్ అధికారిక వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీబీఐ ఉచ్చు బిగుస్తుందనే చెప్పాలి. చెన్నై ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ రవిచంద్రన్ ఫిర్యాదు మేరకు ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై కేసు నమోదు చేసింది సీబీఐ. ఫోర్జరీ సంతకాలు, పత్రాలతో బ్యాంకులను మోసం చేసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు రూ.237 కోట్లు రుణాలను ఎగ్గొట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
అయితే ఇంద్ భారత్ పవర్ లిమిటెడ్ డైరెక్టర్ గా ఉన్న ఎంపి రఘురామ కృష్ణమరాజు, ఇతర డైరెక్టర్లు కనుమూరు రమాదేవి, రాజ్ కుమార్ గంటా, దుంపల మధు సూదన రెడ్డి, నారాయణ ప్రసాద్ భాగవతుల, రామచంద్ర అయ్యర్ లపై సీబీఐ కేసు నమోదు చేసింది. కాగా ఫోర్జరీ పత్రాలు పెట్టి బ్యాంకు రుణాలు పొందిన రఘురామ కృష్ణంరాజు కంపెనీ.. రుణంగా పొందిన రూ. 237 కోట్ల రుణాలను పక్కదారి పట్టించినట్లు సీబీఐకి చెన్నై ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ రవిచంద్రన్ ఫిర్యాదు చేశారు. అయితే మార్చి 23న రవిచంద్రన్ చేసిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. దీంతో ఏకంగా సీబీఐ రంగంలోకి దిగడంతో ఆర్ఆర్ఆర్ పరిస్థితి నెక్ట్స్ ఏంటి అనేది ఉత్కంఠగా మారింది.