ఆనందయ్య మందుతో వెలుగులోకి… రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి

ఆంధ్రప్రదేశ్ లోని ఆనందయ్య మందుతో సంచలనం సృష్టించిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి చెందారు. పరిస్థితి సీరియస్గా ఉన్న సమయంలో.. ఆనందయ్య మందు తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే కోలుకున్నట్టు అప్పట్లో మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య ఇక లేరు. ఆనందయ్య మందు తీసుకున్న తర్వాత వెంటనే నయం అయినట్టు అనిపించినా.. ఆరోగ్యం సహకరించక పోవడంతో మళ్లీ ఆయన నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. అయితే ఆనందయ్య మందు వికటించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే స్టోరీలు కూడా నడిచాయి. ఓ దశలో చనిపోయారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. కానీ, ఇంతకాలం ఆస్పత్రిలో చికిత్స పొందిన కోటయ్య.. ఈరోజు ఉదయం చనిపోయారు.
అదేవిధంగా కోట మండలం తిన్నెలపొడికి చెందిన రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య… ఆనందయ్య వద్ద కంట్లో చుక్కలు వేసుకుని బ్రతికానన్న వీడియోతో అప్పట్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. కంట్లో చుక్కల మందు వేసుకున్న వారం రోజులకు ఆరోగ్యం క్షిణించి కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కోటయ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం 22న నెల్లూరు జిజిహెచ్ కి తరలించారు. వారం రోజుల నుండి చికిత్స పొందుతూ నెల్లూరు జిజిహెచ్ లో ఈరోజు కోటయ్య మరణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *