ఆదిపురుష్ నెక్స్ట్ షూటింగ్ ముంబైలోనే…!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఓంరౌత్ కాంబినేషన్ లో త్రీడీ సినిమా ఆదిపురుష్ ప్రకటన వచ్చినప్పటి ఆ ప్రాజెక్ట్ పై భారీ క్రేజీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే ఈ పాన్ ఇండియా మూవీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మాత భూషణ్ కుమార్ తెరకెక్కించదుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కు కి ముందు ముంబై కేంద్రంగా షూటింగ్ మొదలై ఆ తర్వాత పలు కారణాలతో ఆ షెడ్యూల్ కు బ్రేక్ పడింది.
అదేవిధంగా మహారాష్ట్రలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆదిపురుష్ షూటింగ్ ను హైదరాబాద్ కు షిఫ్ట్ చేస్తున్నారనే వార్తలూ కూడా ఆ మధ్య హల్ చల్ చేశాయి. కానీ… తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే… ఈ నెల సెకండ్ ఆఫ్ ప్రారంభంలోనే ముంబైలో ఆదిపురుష్ తాజా షెడ్యూల్ మొదలెట్టాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాలు రెగ్యులర్ షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అదే క్రమంలో ఆదిపురుష్ మొదలు పెడతారని, హైదరాబాద్ కంటే ఓ రకంగా ముంబైలోనే వాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతోందని సమాచారం అందుతుంది. దీంతో అక్కడే అంటే ముంబైనే సేఫ్ ప్లేస్ గా సినిమా యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. మరి… ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.