అల్లు డాటర్ డబ్ స్మాష్ తో అదరగొట్టింది….
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ డాటర్ మరోమారు తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఇప్పటివరకు మనం పాపులర్ మూవీ డైలాగ్స్ కు, సాంగ్స్ కు డబ్ స్మాష్ చేసే వాళ్ళను చూశాం. కానీ.. ఇప్పుడు అల్లు అర్జున్, స్నేహరెడ్డిల ముద్దుల కూతురు అర్హా చేసిన డబ్ స్మాష్ మాత్రం వాటన్నిటి తర్వాతే అనుకోవాలి. ఎక్స్టార్డినరీ అనిపించేలా ఇరగదీసింది. సోషల్ మీడియాలో ఈ మధ్య ఓ వాయిస్ విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ‘నీ ఫేవరెట్ యాక్ట్రస్ ఎవరు?’ అనగానే ‘జాక్విలిన్ ఫెర్నాండేజ్’ అని చెప్పిన మనిషిని స్పెల్లింగ్ చెప్పమని అడగగానే వెంటనే ‘అలియా భట్’ అని మాట మార్చే వాయిస్ అది.
అయితే నాలుగేళ్ళ అల్లు అర్హా కూడా ఈ వాయిస్ కు డబ్ స్మాష్ చేసేసింది. అసలు విశేషం ఏమిటంటే… ‘జాక్విలిన్ ఫెర్నాండేజ్… అలియా భట్’ అనే పదాలకు చిన్నారి అర్హా సూపర్ గా లిప్ సింక్ చేసింది. అంతేకాకుండా… ఈ బుల్లి పాపాయి వీడియోలో ఫీలింగ్స్ ని కూడా చక్కగా ఎక్స్ ప్రెస్ చేసి చూపింది. కాగా ఈ మధ్య స్నేహారెడ్డి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేసరికీ రెండు రోజుల్లో దాదాపు మూడు లక్షల వ్యూస్ వచ్చేశాయి. మొత్తానికి డిఫరెంట్ ప్రయోగాలతో తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంటోంది బేబీ అర్హా. నిజంగా అర్హా గ్రేట్ అంటోంది సోషల్ మీడియా.