అమీర్ ఖాన్.. కిరణ్ రావు విడాకులపై కంగనా సంచలన కామెంట్స్..!

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకుల విషయం అందరినీ షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఆసక్తికరమైన కామెంట్స్ గుప్పించారు. వారిద్దరి విడాకులపై స్పందించిన కంగనా వీరి విడాకులకు కారణం కులాంతర వివాహమేనా? అంటూ వెరైటీ అనుమానాన్ని వ్యక్తం చేసింది. అలాగే అమీర్ ఖాన్-కిరణ్ రావు విడాకుల విషయంలో కులాంతల వివాహం ముఖ్యపాత్ర పోషించిందని కూడా తమ అనుమానాన్ని వెల్లడించింది.
అదేవిధంగా కిరణ్ రావు హిందూ మతానికి చెందినది కాగా అమీర్ ఖాన్ తన కొడుకును ఎందుకు హిందువుగా పెంచలేదు? అంటూ ఆమె ప్రశ్నాస్త్రాన్ని సంధించింది. అలాగే కిరణ్ రావు వివాహం తర్వాత ఇస్లామిక్ లోకి ఎందుకు మారిపోయింది? ఆమె హిందూ మతాన్ని ఎందుకు కొనసాగించలేదు? వారి విడాకుల విషయంలో కులాంతర వివాహం కీలకపాత్ర పోషించింది అని అన్పిస్తోంది అంటూ కంగనా కాస్త వివాదాస్పద వ్యాఖ్యలే చేసింది. కాగా కంగనా వ్యాఖ్యలపై నెటిజన్లు పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే అమీర్ ఖాన్-కిరణ్ రావు విడాకుల విషయంపై నెటిజన్లు లవ్ జీహాద్ అంటూ మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *