అప్పుడు ప్రెగ్నెన్సీ… నిజమే.. అయితే తప్పేంటి: దియా మీర్జా
వైల్డ్ డాగ్ సినిమాలో నాగార్జునకు భార్యగా తెలుగు తెరపై కనిపించిన దియామీర్జా నెటిజన్లకు ధీటుగా జవాబిచ్చింది. ప్రముఖ నటి, నిర్మాత దియా మీర్జా ఈ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీ వైభవ్ లేఖిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నిజానికి వీరిద్దరికీ ఇది రెండవ పెళ్లే. తాజాగా ఓ నాలుగు రోజుల ముందు దియా మీర్జా తాను గర్భవతిని అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో ఆమెను తోటి నటీనటులంతా అభినందనలతో ముంచెత్తారు. ఈ మధ్య దియా మీర్జా, తన భర్త వైభవ్ లేఖి, అతని కుమార్తెతో కలిసి మాల్దీవ్స్ కు జాలీడే ట్రిప్ కు వెళ్ళొచ్చింది. ఆ తర్వాత ఈ శుభవార్తను తన అభిమానులతో షేర్ చేసుకుంది.
ఈ సమయంలో సహజంగా కొంతమంది నెటిజన్లు దియా మీర్జాపై విమర్శల బాణాలు ఎక్కుబెట్టారు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాతే దియా వైభవ్ లేఖీని పెళ్లి చేసుకుందని.. ఈ విషయాన్ని పెళ్ళికి ముందే ఎందుకు చెప్పలేదు అంటూ చురకలు అంటించారు. అయితే వాటికి దియా మీర్జా తనదైన శైలిలో ధీటుగా బదులిచ్చింది. తమ పెళ్ళికి ప్రెగ్నెన్సీ రావడం కారణం కాదు, కొంతకాలంగా కలిసి జీవిస్తున్నా తాము పెళ్ళి చేసుకుంటే బాగుంటుందని భావించాం అంతే, అయితే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో పెగ్రెన్సీ విషయం తెలిసింది. కాగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోజు తన జీవితంలో ఇప్పుడు రావడం ఆనందంగా ఉంది అంటూ దియా స్పష్టం చేశారు.
అంతేకాకుండా ఇంకా దియా ఏమన్నారంటే. ఓ మహిళ తనకు సంబంధించిన నిర్ణయాలను తనకు తానుగా తీసుకునే అవకాశం ఉండాలని, అది పిల్లలను కనడం, పెళ్ళి చేసుకోవడం ఏదైనా కావచ్చు అంటూ కితాబిచ్చారు. మరి ఇప్పటికైనా ట్రోలర్స్ అవాకులు చవాకులు ఆపుతారేమో చూడాలి.