‘అనుకోని అతిథి’ నిర్మాత కృష్ణ కుమార్ ఇకలేరు…..
టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా సమయంలో మరీ ఎక్కువ మృతులు చోటుచేసుకుటుండటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పవచ్చు. తాజాగా సాయి పల్లవి, ఫహద్ ఫాసిల్ జంటగా నటించిన ‘అథిరన్’ తెలుగు వెర్షన్ నిర్మాత అన్నపురేడి కృష్ణ కుమార్ కన్నుమూశారు. అయితే కృష్ణ కుమార్ గుండెపోటుతో వైజాగ్ లోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
అయితే ఫహద్ ఫాసిల్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన మలయాళ సినిమా ‘అథిరన్’. 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులను మంచి థ్రిల్ చేయడం విశేషం. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో ‘అనుకోని అతిథి’ గా విడుదల చేస్తున్నారు. వివేక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అతుల్ కులకర్ణి, రెంజీ పానికర్, శాంతి కృష్ణ, ప్రకాష్ రాజ్, సురభి ముఖ్యమైన పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగులో డిజిటల్ లో విడుదల కానుంది. కాగా మే 28నుంచి ప్రముఖ తెలుగు ఓటిటి వేదికపై స్ట్రీమింగ్ కానుంది అనుకోనని అతిథి. కృష్ణ కుమార్ నిర్మించిన ఈ సినిమా మరో రెండ్రోజుల్లో విడుదల కానుండగా… ఆయన మృతి చెందడం ఎంతో బాధాకరమైన విషయంగా చిత్రపరిశ్రమ తమ సంతాపాన్ని వ్యక్తం చేసింది.