అది కారైనా.. బైక్ అయినా మాస్క్ తప్పనిసరి….
కరోనా వైరస్ చాలా తీవ్రంగా వ్యాపిస్తుంది. రోజుకు లక్షకు పైగా కేసులు నమోదౌతున్నాయి. అయితే ఈ నెలలో రెండోసారి లక్షకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. అయితే దేశరాజధాని ఢిల్లీలో కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ విధించింది. మంగళవారం రాత్రి నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
అదేవిధంగా ఢిల్లీ హైకోర్టు కొన్ని కఠిన నిర్ణయాలను సూచించింది. మాస్క్ పెట్టుకోవడంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కారులో వెళ్తున్నా సరే తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి మాస్క్ సురక్షితమైనదని మాస్క్ పెట్టుకోవడం వలన వైరస్ వ్యాప్తికి కొంతమేర అడ్డుకట్ట వేయ వచ్చని ధర్మాసనం వివరిచింది. కాగా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు కూడా తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది.