అతిసారా బాధిత ఇంటికెళ్లి పరామర్శించిన మంత్రి నాని…

ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ కర్నూలు జిల్లా ఆదోనిలో కొంతమంది అతిసారా బారిన పడిన విషయం తెలిసిందే. ఆదోనిలోని అరుణ్ జ్యోతి నగర్ లో కలుషిత నీరు తాగి అతిసారకు గురైన బాధితులను డిప్యూటీ సీఎం, ఆళ్ల నాని పరామర్శించారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి స్థానిక పరిస్థితులను తెలుసుకున్న ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బాధితులను కలిసి ధైర్యం చెప్పి ఆయన మంత్రి.. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు. జిల్లా మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ కూడా మంత్రితో పాటు అదోనిలో పర్యటించారు. పూర్తి స్థాయిలో రిపోర్ట్ వచ్చే వరకు ఇక్కడే ఉంటూ డయేరియా కేసులు తగ్గించాలని కర్నూలు ఎమ్ హెచ్ ఓ డాక్టర్ రామ గిడ్డయ్యను మంత్రి నాని ఆదేశించారు.
అలాగే కలుషిత నీరు తాగి మృతి చెందిన ఇంట్లో ఇప్పటికే నలుగురు విరేచనాలతో బాధ పడుతున్నారని అన్నారు. అరుణ జ్యోతి నగర్ లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో…? అతిసార కేసులు ఎన్ని ఉన్నాయో…ఆశ, ఏఎన్ఎం, వలంటీర్ , డాక్టర్లు 15 వందల ఇండ్లకు ఇంటింటికి వెళ్లి సర్వే చేసి వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి 100 కుటుంబాలకు ఒక మెడికల్ క్యాంపు తక్షణమే ఏర్పాటు చేయాలని డిఎమ్ హెచ్ అదేశించారు. అరుణ జ్యోతి నగర్ లో రాత్రి, పగలు 6టీమ్ లతో కలిసి మెడికల్ క్యాంపు నిర్వహించి విరేచనాలు ఎక్కువ అయితే దగ్గర్లో ఉన్న అర్బన్ హెల్త్ హాస్పిటల్ కు వెంటనే చేర్చాలని తెలిపారు. ఇంకా అర్బన్ హెల్త్ సెంటర్ లో 2 అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని అన్నారు. ఇక అతిసార మరణాలు అసలు జరగకూడదని స్పష్టం చేశారు.
ముఖ్యంగా ఆదోనికి డిప్యూటేషన్ పై గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ను నియమించాలిని డీఎంహెచ్వో ను మంత్రి ఆళ్ల నాని సూచించారు. డయేరియా కేసులు పునరావృతం కాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆదోనిలో సరఫరా చేస్తున్న మంచినీటి శాంపిల్స్ ను విజయవాడ ల్యాబ్ కి పంపించాలని తెలిపారు. కాగా అతిసారతో మృతి చెందిన రంగమ్మ కుటుంబానికి 3 లక్షలు ఎక్స్ గ్రేషియాని మంత్రి నాని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *